33.2 C
Hyderabad
April 26, 2024 01: 31 AM
Slider ప్రత్యేకం

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తీర్పు నేడు

#Avinash Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీని విచారించేందుకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసులతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇటీవలే విచారణ చేపట్టి అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది, సీబీఐ తరఫు లాయర్ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈ కేసులో తీర్పు నేడు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికి కన్నా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని.. అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts

టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

Satyam NEWS

సిఎం జగన్ పై సుప్రీంలో రఘురామ కొత్త పిటిషన్

Satyam NEWS

మేడారం జాతర నిర్వహణ కు రూ. 75 కోట్లు

Satyam NEWS

Leave a Comment