ఆర్టీసీ సమ్మె పై ధాఖలైన పిటిషన్ లపై వాదనలు ముగిశాయి. రేపు ఆర్టీసీ జీతభత్యాలు, రూట్ల ప్రయివేటీకరణ, కార్మికుల ఆత్మహత్య లపై ధాఖలైన పిటిషన్ల విచారణ ప్రారంభం అవుతుంది. చర్చలకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడంలో హై కోర్టు కు కొన్ని పరిమితులున్నాయని, దాన్ని దాటి కోర్టు ముందుకు పోలేదని న్యాయమూర్తి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశిస్తామని చెప్పారు. రెండు వారాల్లో సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కమిషనర్ కు ఆదేశిస్తామని కూడా చెప్పారు. ఈ విషయాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హై కోర్టు చెప్పింది. చర్చలు జరపాల్సిందేనని ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హై కోర్టు ప్రకటించింది.