32.7 C
Hyderabad
March 29, 2024 11: 10 AM
Slider చిత్తూరు

వైకుంఠ ఏకాదశి సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి

#NaveenkumarReddy
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని రాయలసీమ విమోచన సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సామాన్య భక్తుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి గంటలకొద్దీ వైకుంఠం కంపార్ట్మెంట్లలో బందీలుగా ఉంచారని ఆయన అన్నారు. కనీసం అన్నప్రసాదాలు,పసిపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. భక్తులు బహిరంగంగా ఆలయం ముందు బైఠాయించి టిటిడి ఉన్నతాధికారుల పేర్లతో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారని ఆయన గుర్తు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల జేఈవో, చైర్మన్ కార్యాలయం నుంచి
A) వీఐపీలకు ఎన్ని టిక్కెట్లు ఎవరెవరికి కేటాయించారు? 
B) శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లు ఎన్ని కేటాయించారు?
C) సుపథం దర్శనం టిక్కెట్లు ఎన్ని కేటాయించారు?? 
అన్నదానిపై వాస్తవాలు భక్తులకు తెలిసేలా మీడియా ముఖంగా పూర్తి జాబితా విడుదల చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
గతంలో వైకుంఠ ఏకాదశి ఇతర పర్వదినాలలో vip లతో సహా సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకునే వారు అలాంటిది నేడు కరోనా వైరస్ కారణంగా పరిమిత సంఖ్యలో ఆన్లైన్ టిక్కెట్లు పొందిన భక్తులను అనుమతించారు. స్థానికులకు "రేషన్" పద్ధతిలో కేవలం రోజుకు 5 వేలు కేటాయించారు టిటిడి ఉద్యోగస్తులకు వారి కుటుంబాలకు టైం స్లాట్ పద్ధతిలో అనుమతించారు కనీసం వారి బంధుమిత్రులకు కూడా రెఫరల్(సిఫార్సు లేఖ) ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
శ్రీవారి సామాన్య భక్తులకు దర్శనాలలో "పెద్దపీట" అని పర్వదినాల ముందు మీటింగులు మీద మీటింగులు పెట్టి హడావిడి చేసే అధికారులు,ధర్మకర్తల మండలి చేప్పే మాటలకు అర్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గంటలకొద్దీ భక్తులను ఆకలితో అలమటిస్తూ కూర్చొని పెట్టడమా? అంటూ ఆయన ప్రశ్నించారు.

కేంద్రం గంట గంటకు పెరుగుతున్న వైరస్ పై మార్గదర్శకాలు ప్రకటిస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల ప్రముఖులకు, పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు వారి వెంట వచ్చిన మంది మార్బలంకు టికెట్లు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసం అని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలలో బైఠాయించి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం యావత్ హిందూ బంధువుల మనస్సులను కలచివేస్తోందని ఆయన అన్నారు. ఈ సంఘటనలకు బాధ్యులైన అధికారులను గుర్తించి తిరుమల కొండ నుంచి మాతృ సంస్థకు సాగనంపాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

అత్యధిక మార్కులు సాధించిన నవ్వకు ప్రశంస

Satyam NEWS

త్వరలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన….!

Satyam NEWS

వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు కుట్రలకు కేంద్రాలయం

Satyam NEWS

Leave a Comment