28.7 C
Hyderabad
April 25, 2024 06: 11 AM
Slider పశ్చిమగోదావరి

కోట్లు కొల్లగొడుతున్న వి ఆర్ ఓ కు ఉన్నతాధికారుల అండ?

#Pedavegi

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లో అవినీతికి పాల్పడుతున్నారంటూ  తాహసీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేసిన వి ఆర్ ఓ లలో అత్యంత అవినీతిపరుడిని మాత్రం కొనసాగిస్తున్నారు. సరెండర్ చేసిన వి ఆర్ ఓ లు మొత్తం నలుగురా లేక ఐదుగురా అనే క్లారిటీని ఉన్నతాధికారులు ఇవ్వడం లేదు. ఒక వి ఆర్ ఓ దగ్గర ముడుపులు తీసుకుని ఆ వి ఆర్ ఓ ని సరెండర్ చేయకుండా ఓ అధికారి అడ్డుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ వి ఆర్ ఓ నే అధికారుల ఆర్థిక ఆదాయ వనరుగా చెప్పుకుంటారు. ఈ వి ఆర్ ఓ నే ఏలూరు నుండి భీమడోలు వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న అత్యంత ఖరీదైన రెస్టారెంట్ లో అధికారులకు ఆతిథ్యం ఇచ్చి తనకు అవసరమైన ఆదాయం వచ్చే మ్యుటేషన్ పైల్స్ పై, బోరు సర్టిఫికెట్ ల పైన, సంతకాలు చేయించుకుని అధికారుల చేతులు పూర్తి స్థాయిలో తడు పుతాడని రెవిన్యూ సిబ్బంది చెప్పుకుంటారు.

పెదవేగి మండలం లో అత్యంత అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వి ఆర్ ఓ పేరు సరెండర్ లిస్ట్ నుండి తప్పించి దళిత సామాజిక వర్గానికి చెందిన 4 గురు వి ఆర్ ఓ లను మాత్రమే అధికారులు రెగ్యులర్ విధుల నుండి తప్పించి తహసీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేయడం పై అధికారుల తీరుపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఈ విషయం బయటికి పొక్కకుండా గుట్టుగా ఉంచినప్పటికి సరెండర్ అవ్వాల్సిన వి ఆర్ ఓ పై అధికారుల పక్షపాత వైఖరిని కొంతమంది రెవిన్యూ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. సరెండర్ అయ్యేవాళ్ళలో మొదటి స్థానంలో ఉండాల్సిన వి ఆర్ ఓ ని తప్పించవలసిన అవసరమేమిటని కొంత మంది వి ఆర్ ఓ లు తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది.

లక్షలాది రూపాయలు వసూలు చేసిన వాడు ఇంకా ఉన్నాడంటే అర్ధం ఏమిటి?

ఆ వి ఆర్ ఓ ని సరెండర్ చేయకపోగా విధులకు హాజరు కాకుండా కొన్ని వంకలు చూపి తహసీల్దార్ కార్యాలయం లొనే తచ్చాడుతుండమేమిటని రెవిన్యూ సిబ్బంది చర్చించుకుంటున్నట్టు సమాచారం. సరెండర్ కాకుండా తప్పించుకున్న వి ఆర్ ఓ ఆయన విధులు నిర్వహించే గ్రామంలో కొంతమంది రైతులనుండి భూములు కన్వర్షన్ చేయిస్తానని, ఆడంగల్ కరెక్షన్స్ చేయిస్తానని, భూములమ్యుటేషన్ ల వ్యవహారంలో కూడా లక్షలాదిరూపాయలు వసూలుచేసినట్టు తెలిసింది.

దీంతో ఆ వి ఆర్ ఓ పై ఆ గ్రామ రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడం తో అసలు విషయం బయటపడినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వి ఆర్ ఓ ఆర్థికంగా బలమైన వ్యక్తి అగ్రకులానికి చెందిన వ్యక్తి కావడం తో   కొద్ది రోజులు సెలవులో ఉండి ఆ తరువాత కూడా ఆ వి ఆర్ ఓ విధులకు హాజరు కాకుండా తహసీల్దార్ కార్యాలయంలోనే కాలం గడుపుతున్నట్టు సమాచారం.

ఇంతకీ ఆ వి ఆర్ ఓ కి అత్యంత ఆదాయ వనరులున్న ఓ గ్రామానికి వి ఆర్ ఓ గా బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని రెవిన్యూ కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయాలన్నీ అందరికి  తెలిసినా పైకి చెప్పలేక పోతున్నామని కొంతమంది వి ఆర్ ఓ లు గుస గుసలాడుకుంటున్నట్టు విశ్వాసనీయ సమాచారం. పెదవేగి తహసీల్దార్ కార్యాలయం లో మ్యుటేషన్ ల ముసుగులో రైతులను అడ్డగోలుగా ఆర్థిక దోపిడీ జరుగుతుందని వస్తున్న ఆరోపణలపై  జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని మండలంలో బాధిత రైతులు కోరుతున్నారు.

మరో ప్రక్క మ్యుటేషన్ ల వ్యవహారం లో రెవిన్యూ అధికారులకు రైతులు చేజారిన లక్షలాది రూపాయలు తిరిగి చేతికొచ్చేనా, చేజారిన నగదును ప్రతిఫలంగా మ్యుటేషన్ లు ప్రక్రియ సజావుగా చేస్తారా లేదా అనే భయం రైతులను కలవర పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

Related posts

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

సస్పెన్స్ థ్రిల్లర్ ఐఐటి కృష్ణమూర్తి 10న ప్రేక్షకుల ముందుకు!

Satyam NEWS

అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా రామతీర్థం వెళ్లిన చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment