36.2 C
Hyderabad
April 18, 2024 12: 37 PM
Slider హైదరాబాద్

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేత‌నం రూ. 3 వేలు పెంపు

kcr

దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి జీతాన్ని రూ.3 వేలు పెంచుతున్నట్లు తెలిపింది. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ విషయాన్నితెలిపారు.


పారిశుద్ధ్య కార్మికుల సేవలతోనే హైదరాబాద్‌ ప్రస్తుతం ఓ బ్రాండ్‌ ఇమేజ్‌తో ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకత అంటూ ఉన్నది వారి వల్లనే అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో వారి జీతాల పెంపును చేపట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటిదాకా కార్మికుల జీతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.8,500 ఉండేదని, దాన్ని 2015లో రూ.12,500 చేశారని అన్నారు.


నగరంలో కోటి మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే దాన్ని శుభ్రం చేసేందుకు 25 వేల మంది సిబ్బంది కష్టపడుతున్నారని అన్నారు. వారి జీతాన్నిగతంలో రూ.14,500 చేశారని అన్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా మరో రూ.3 వేలు జోడిస్తూ వారి జీతాన్ని రూ.17,500గా చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.


వేత‌నాలు పెర‌గ‌డం ప‌ట్ల పారిశుధ్య కార్మికుల సంతోషం


త‌మ వేత‌నాలు మ‌రో రూ. 3వేలు పెర‌గ‌డం ప‌ట్ల జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు సంతోషం వ్య‌క్తం చేశారు. గ‌తంలో కేసీఆర్‌తో స‌ఫాయి కార్మికులు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నామ‌న్నారు. ఎట్ట‌కేల‌కు సీఎం కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు మంత్రి కేటీఆర్ వేత‌నాలు పెంచుతున్నామ‌ని చెప్ప‌డం సంతోషం క‌లిగింద‌ని అన్నారు. నేడే త‌మ‌కు నిజ‌మైన దీపావ‌ళి పండుగ అని కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts

మొక్కలు నాటిన న్యాయమూర్తులు

Bhavani

సెల్ ఫోన్లను అప్పగించిన ఎస్పీ

Satyam NEWS

నిధులు వచ్చేనా..? పనులు సాగేనా..?

Satyam NEWS

Leave a Comment