39.2 C
Hyderabad
March 29, 2024 14: 04 PM
Slider ముఖ్యంశాలు

హిందూ ఐక్యత వెల్లడించేందుకు 30న దీక్షకు పిలుపు

#Hindu Dharmika Mandali

రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కిన హిందూ ధార్మిక సంస్థలను కాపాడుకోవాలని హిందూ ధార్మిక మండలి పిలుపునిచ్చింది. ఇందుకోసం రేపు (మే 30న) ధర్మ దీక్ష చేయాలని సంకల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన భూములను నిరర్ధక ఆస్తులుగా పేర్కొంటూ అమ్మేందుకు టీటీడీ సంసిద్ధమైన విషయం తెలిసిందే.

ప్రజా ప్రతిఘటన దృష్ట్యా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా తిరుమల తిరుపతి దేవస్థానం భూములతో బాటు స్థిర చర ఆస్తులకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది. దీన్ని అడ్డుకోవాలంటే హిందువులంతా సంఘటితమైతే తప్ప సాధ్యం కాదు.

అందుకోసం హిందువులు తమ సంఘీభావాన్ని తెలిపేందుకు మే 30న ఉదయం 11 గంటల నుంచి తమ ఇంటి ముందు ప్లకార్డుతో నిరసన తెలపాలి. ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. సాయంత్రం 7 గంటలకు ఏడుకొండల స్వామికి 7 దీపాలు వెలిగించి మూడు నిమిషాల పాటు ఘంటానాదం చేసి పాలకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను అమ్మరాదని, హిందూ దేవాలయ భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేయరాదని హిందూ ధార్మిక మండలి కోరుతున్నది. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని మండలి కోరుతున్నది.

దేవాలయ భూములు ఇతర ఆస్తులను ఆక్రమిస్తున్న వారిపై చట్టబద్ధమైన చర్యల తీసుకోవాలని ధార్మిక మండలి డిమాండ్ చేస్తున్నది. హిందూ దేవాలయాలను కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టి సంఘటిత భావాన్ని పాలకులకు తెలియ చేయాలని హిందూ ధార్మిక మండలి కోరుతున్నది.

Related posts

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఆకలి దేవోభవ

Satyam NEWS

హిందూత్వం పై కవితలకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment