ఉమ్మడి ఏపీలో నాడు సీఎం గా ఉన్న, ఓ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు పుట్టిన జిల్లాలో ఎటుచూసిన కాషాయ రెపరెపలే కనిపించాయి. సర్వత్రా జైశ్రీరామ్ నినాదాలతో హిందువులు ఊర్రూతలూగించారు. దేవాలయాలు స్వయం ప్రతిపత్తిగా ఉండాలంటూ విశ్వహిందూ పరిషత్ ఏపీ శాఖ విజయవాడ కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించింది. ఈ శంఖారావం బహిరంగ సభకు వీహెచ్పీ జాతీయ అధ్యక్షులు, అయోద్య ట్రస్టీఅధినేత, త్రిదండి చినజీయర్, ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్, నరసాపురం మాజీ ఎంపీ, వీహెచ్పీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, హైందవ శంఖారావం కన్వీనర్ తనికెళ్ల రవికుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి లతో పాటు పలు పీఠాధిపతులు హాజరయ్యారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వం హిందువుల సొమ్ము రాబెట్టేందుకు దేవాలయం చట్టం తీసుకొచ్చిందని వక్తలు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1980 చట్టంలి మరిన్ని క్లాజులు పెట్టి దేవాలయాల నుంచీ దండుకో వడం కొనసాగించిందన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలని పీఠాధిపతులంతా ముక్తకంఠంలో నినదించారు. కేశవరంలో జరిగిన హైందవ శంఖరావంకు దాదాపు 3లక్షల మంది హిందువులు హాజరయ్యారు.
previous post