రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి మరో హై పవర్ కమిటీ వేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. హైపవర్ కమిటీని నియమించి అన్ని విషయాలూ కూలంకషంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా నియమించే హైపవర్ కమిటీ 3 వారాల్లో రిపోర్ట్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హై పవర్ కమిటీ ఉద్యోగుల బదలాయింపు, కార్యాలయాల తరలింపు పై నివేదిక ఇస్తుంది.
ఈ హైపవర్ కమిటీలో ఉద్యోగులు, మంత్రులు, ఐ ఏ ఎస్ అధికారులు ఉంటారు. మంత్రివర్గ సమావేశంలో రాజధాని పై ప్రతి ఒక్క మంత్రి సూచనలు ముఖ్యమంత్రి జగన్ అడిగారు. కొందరు మంత్రులు కమిటీ వేయాలని సూచించగా మరి కొందరు మాత్రం కమిటీ అవసరం లేదని మీ మాట మా మాట అని అన్నారు. అయితే చివరకు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.