36.2 C
Hyderabad
April 25, 2024 21: 52 PM
Slider తెలంగాణ

కొల్లాపూర్ చరిత్రకు తూట్లు పొడుస్తున్న స్వార్థపరుల ప్లాట్లు

kolla fort

తెలంగాణ మైసూర్ గా పేరు పొందిన కొల్లాపూర్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం అవుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న ఈ కొల్లాపూర్ కు ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది కొల్లాపూర్ ప్యాలెస్. సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర దేవాలయాల ప్రాంగణమైన ఈ ప్రాంతంలో కొల్లాపూర్ ప్యాలెస్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొల్లాపూర్ కోటను అభివృద్ధిపరచి దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఇక సందర్శకుల తాకిడి చెప్పలేనంతగా ఉంటుంది.

ఇదే ప్రయత్నాన్ని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చాలా కాలంగా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆయన సిద్ధం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన కొల్లాపూర్ కోటను ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే ఆలోచించారు. అయితే ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. దాంతో స్వార్థపరులకు రెక్కలు వచ్చాయి. అడ్డుగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు పదవి, అధికారం లేకపోవడం స్వార్థపరులకు మేలు చేసింది.

2005లో దాదాపు 39 మంది కొల్లాపూర్ రాజా బంగ్లా వెనుక భాగాన ప్లాట్లు కొన్నారు. అప్పటిలో జూపల్లి కృష్ణారావు ఎం ఎల్ గా ఉండేవారు. కొల్లాపూర్ కోటను చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రదేశం చేయాలన్న ఆలోచన అప్పటి నుంచి ఆయనకు ఉండేది. తర్వాత జరిగిన పరిణామాలతో ఈ కేసు కోర్టుకు చేరింది. ఆ తర్వాత మంత్రి అయి జూపల్లి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలనుకున్నా కోర్టు కేసు అడ్డుగా ఉండేది.

2014 ఎన్నికలో జూపల్లి ఓటమి కావడంతో ఒక్క సారిగా అందరికి రెక్కలు వచ్చేశాయి. ఇటీవల కోర్టు కేసు క్లియర్ అయింది. దాంతో మునిసిపల్ అధికారులు ప్లాట్లకు అనుమతులు ఇచ్చేశారు. కొందరు నాయకుల ప్రమేయంతో బంగ్లా చుట్టూ ప్రాంతం ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. దీనికి కొందరు కామ్రేడ్లు సహకరిస్తున్నారు. దళిత ఎమ్మార్పీఎస్ లీడర్లు మద్దతు పలుకుతున్నారు. ఈ మధ్యలో స్థానిక మునిసిపల్ కమిషనర్ అనుమతులు ఇవ్వడంతో జూపల్లి సీరియస్ అయ్యారు. శుక్రవారం రాష్ట మున్సిపల్ అధికారికి ఆయన ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.

Related posts

ఫెస్టివల్ ట్రీట్:అన్న‌పూర్ణ స్టూడియోలో సంక్రాంతి సంబురాలు

Satyam NEWS

క్వశ్చన్ అవర్: బిజెపితో హనీమూన్ పిరియడ్ ముగిసిందా?

Satyam NEWS

డీఎస్పీ పాపారావు అకాల మరణం తీరని లోటు

Satyam NEWS

Leave a Comment