21.2 C
Hyderabad
December 11, 2024 21: 05 PM
Slider సినిమా

మరో సారి జంటగా వస్తున్న కాజల్, రానా

rana kajal 45

చాలా భారతీయ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రానా, ప్రస్తుతం విరాటపర్వం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే రానా, నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కొరియన్ మూవీని తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రెడీ అయిన నందిని రెడ్డి, ఈ సినిమాలో రానా పక్కన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుందట. అయితే ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి, డేట్స్ ఖాళీగా లేవ‌ని రానా సినిమాకి చెప్పేసింద‌ట‌. దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే రానా, కాజల్ అగర్వాల్ కలిసి నేనే రాజు నేనే మంత్రి చేశారు. కమర్షియల్ గా మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమాలో కాజల్, రానా మధ్య కెమిస్ట్రీకి మంచి అప్లాజ్ వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే సినీ అభిమానుల్లో పాజిటివ్ బజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related posts

ఎల్లారెడ్డి లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

Satyam NEWS

దళిత బంధు తరహాలో ఆదివాసులకు సాయం చేయాలి

Satyam NEWS

పెద్దగట్టు జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాహనాల మళ్లింపు

Bhavani

Leave a Comment