37.2 C
Hyderabad
April 18, 2024 22: 27 PM
Slider మెదక్

కొత్తూరులో హైటెక్ వ్యభిచారం..?

#kotturu

కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ వెంచర్ ఫామ్ హౌజ్ లో పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి చెందిన  ప్రాంతానికి చెందిన ఐదు మంది విటులు యువతీని ఫామ్ హౌస్ కు తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.

అయితే యువతిని ప్రలోభ పెట్టి తీసుకు వచ్చారా? లేక వ్యభిచార నేపథ్యంలో తీసుకువచ్చారా? అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఒక యువతితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి మూడు కార్లు..నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఓ సర్పంచ్ ఈ ఫామ్ హౌస్ అని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ విషయమై కొత్తూరు సిఐ బాలరాజ్ ను మీడియా వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ 5 మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు ధృవీకరించారు. బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచారు..

ఆ ప్రజాప్రతినిధి ఉన్నాడా..?

ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి ఉన్నట్టు బయట ప్రచారం కొనసాగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా? అనే అంశం చర్చ జరుగుతుంది. ఫామ్ హౌస్ లో మొత్తం ఆరు మంది మహిళతో కలిపి ఉండగా ఇందులో ఐదు మంది పోలీస్ అదుపులోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరిలో సదరు ప్రజాప్రతినిధి ఉన్నాడా? లేదా అన్న విషయం విచారణలో తెలియాల్సి ఉంది. సదరు ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసి పోలీసులకు సమాచారం అందజేసినట్లు కూడా స్పష్టం అవుతుంది.

Related posts

సిటీలో దొంగతనం.. గ్రామాల్లో విక్రయం

Murali Krishna

నిర్లక్ష్యంగా తూనికలు కొలతల అధికారుల పనితీరు

Satyam NEWS

100 శాతం హాజరు ఉన్న విద్యార్ధులకు బహుమతులు

Satyam NEWS

Leave a Comment