32.2 C
Hyderabad
April 20, 2024 20: 39 PM
Slider ముఖ్యంశాలు

పోలీసులతో సమానంగా హోంగార్డుల సేవలు

#homeguard

60వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

60వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, హెూం గార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో హెూంగార్డ్సు ఒక భాగమై పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులును హెూంగార్డ్సు నిర్వహిస్తూ, జిల్లా పోలీసుశాఖలో కీలకంగా పని చేస్తున్నారన్నారు.

పోలీసులు నిర్వహించే బందోబస్తులు, ముఖ్య వ్యక్తుల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ వివిధ విభాగాల్లో హెూంగార్డులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అంతేకాకుండా, పోలీసుల వలే సాంకేతిక పరిజ్ఞానంను కూడా పెంపొందించుకొని, కంప్యూటరు ఆపరేటర్లగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారన్నారు. పోలీసుశాఖకు హెూంగార్డులు అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని 3 హెూంగార్డులకు అతి ఉత్కృష్ట, 13 మంది హెూంగార్డులకు ఉత్కృష్ట పతకాలను అందించామన్నారు.

అదే విధంగా ఉత్తమ సేవలను అందించిన హెూంగార్డులకు ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను కూడా అందించామన్నారు. హెూంగార్డుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ నెల వేతనంతో కూడిన 2రోజులు శెలవులు, మహిళా హెూంగార్డులకు మూడు మాసాలు మెటర్నటీ లీవు, ప్రమాదాల్లోను, విధుల్లోను మరణించిన హెూంగార్డు కుటుంబాలకు 5లక్షలు ఎక్స్ షియా, మ్యారేజ్ రుణాలు, మెరిట్ స్కాలర్షిప్లతోపాటు మరికొన్ని రాయితీలను అందిస్తున్నదన్నారు.

హెూంగార్డ్సు తక్కువ వడ్డీలకు రుణాలను మంజూరు చేసేందుకు, వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగపడేందుకు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా జిల్లాలో ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ అన్నారు. అదే విధంగా హెూంగార్డులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి, చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హెూంగార్డ్సు మృతి చెందినా లేదా ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్ధిక రాయితీలు వచ్చే అవకాశం లేనందున హెూంగార్డ్సు ఒక్క రోజు వేతనంను ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి లేదా మృతి చెందిన హెూంగార్డు కుటుంబానికి ‘చేయూత’గా అందజేస్తూ, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచామన్నారు.

పోలీసు ఉద్యోగులు కూడా హెూంగార్డ్సును ఆర్ధికంగా ఆదుకొనేందుకు తమవంతుగా కొంత మొత్తాన్ని ‘చేయూత’గా అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. హెూంగార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరును తీసుకొని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీసుశాఖకు కూడా మంచి కీర్తిని తీసుకొని వచ్చే విధంగా పని చేయాలన్నారు.

రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించి, ప్రజలకు సహాయకారిగా మెలగాల్సిందిగా హెూంగార్డులకు జిల్లా ఎస్పీ ఎం. దీపికి పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హెూంగార్డ్సుకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రశంసాపత్రాలను అందజేసారు. హెూంగార్డ్సు నిర్వహించిన కవాతు పలువురిని ఆకట్టుకోగా, పరడ్ కమాండరుగా హెూంగార్డు ఎం. శివ సంతోష్ వ్యవహరించారు.

అనంతరం, హెూంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆర్ అండ్ బి బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించి, హెూంగార్డ్సు విధులు, సేవలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎం.ఎం.సోల్మన్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు, డిపిఓ వెంకటరమణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు పి. నాగేశ్వరరావు, చిరంజీవి, మరియన్ రాజు, రమణ మూర్తి, సిఐలు బి. వెంకటరావు, జి.రాంబాబు, రుద్రశేఖర్, సిహెచ్. లక్ష్మణరావు, టి.వి. తిరుపతిరావు, ఈ. నర్సింహమూర్తి, ఎస్పీ ఎం. సత్యన్నారాయణరావు, ఆర్ఎస్ఐలు, హెూంగార్డ్సు ఇన్చార్జ్ ఆర్ఎస్ఐ కేశవరావు, హెడ్ కానిస్టేబుళ్ళు డి.ఎస్.ఎస్.రాజు, కే.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: పసుపులేటి ప్రదీప్ కుమార్

Bhavani

కరోనా పాజిటీవ్ కేసుల్లో 7వ స్థానానికి ఏపీ

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment