విజయనగరం జిల్లా పోలీస్ బ్యారెక్స్ లో 61వ హోంగార్డ్స్ డే హోం గార్డ్స్ కవాతు తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డ్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ సిబ్బంది తో సమానంగా హోం గార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని ఏఎస్పీ కొనియాడారు. వాళ్లకు ఇంక్రిమెంట్ల, రుణ సదుపాయం, లీవ్స్ వెసులు బాటును కల్పిస్తున్నట్టు ఏఎస్పీ సౌమ్యలత ఈ సందర్బంగా మాట్లాడారు. అంతకు ముందు నిర్ణయించిన సమయానికే అంటే ఉదయం 08.30 పరేడ్ మొదలైంది. మూడు ప్లటూన్ల నుంచీ ఏఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. అనంతపురం వివిధ స్థాయిల్లో ఉన్న హోం గార్డ్స్ కు ఏఎస్పీ సౌమ్యలత బహుమతులను ప్రదానం చేశారు. ఇక మొత్తం కార్యక్రమానికి వక్తగా వ్యవహరించిన కే. ఆర్. ఎం. రాజుకు ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ యూనివర్స్, ఇతర విభాగాల డీఎస్పీలు శ్రీనివాస్, వీరకుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరసింహమూర్తి, పోలీస్ పీఆర్ఓ కోటేశ్వరరావు, కిషోర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
previous post