బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె పార్థీవదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. ‘సుష్మాజీ నాకే కాదు.. యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
previous post