32.2 C
Hyderabad
April 20, 2024 21: 17 PM
Slider ముఖ్యంశాలు

కరోనా వైరస్ నివారణకు హోమియో మందు

#Dr.Durgaprasad

కరోనా వైరస్ విజృంభణ ప్రస్తుతం సమాజ వ్యాప్తి దశలో ఉందని, ఇంకా ఇది ఏ మేరకు వ్యాపిస్తుందోనని ఆందోళనలు కూడ చెందుతున్న నేపథ్యంలో వైరస్ నివారణ అంశం మరింత ప్రాథాన్యత సంతరించుకుంది. ఐసీఎంఆర్ చెప్పిన ముందస్తు జాగ్రత్తలతో పాటు హోమియోపతి వైద్యంలో లభించే వ్యాధి నివారణ మందును వాడితే చాలా వరకు  ఈ వైరస్ ను నియంత్రించవచ్చునని సీనియర్ హోమియోపతిక్ వైద్యుడు డా . జి.దుర్గాప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు.

ఆర్సినికం అల్బమ్ – 30 అనే హోమియో మందును ఉదయం పరగడుపున 6 గుళికలు లేదా 4 చుక్కలు వరుసగా మూడు రోజులు తీసుకుంటే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా వైరస్ సంబంధిత జలుబు లక్షణాలు అన్నీ అరికట్టవచ్చునని ఆయన అన్నారు.

తద్వారా ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చునని డా . జి.దుర్గాప్రసాద్ రావు తెలిపారు. ఈ మందును వయసుతో నిమిత్తం లేకుండా అందరూ వాడవచ్చునని,  ఇతర వ్యాధులకు వేరే మందులు వాడుతున్న వారు కూడ ఈ మందును తీసుకోవచ్చని చెప్పారు.

అయితే చిన్న పిల్లలకు పై మోతాదులో సగం ఇస్తే సరిపోతుందన్నారు. కరోనా వ్యాధి నివారణకు ఇప్పటివరకు దాదాపు  మూడు వేల మందికి హోమియో ప్రివెంటివ్ మెడిసన్ తను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు మార్చి నెలలోనే  ఆర్సినికం అల్బమ్ -30 మందును కోవిడ్ వ్యాధి నివారణకు వాడవచ్చునని ధ్రువీకరించిన విషయం గుర్తు చేసారు.

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు సైతం హోమియో వైద్యం ద్వారా కొద్ది రోజుల్లోనే బాగా కోలుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని , అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని , అందుబాటులో ఉన్న హోమియో వైద్యులను సంప్రదించి చికిత్స పొందవచ్చని వివరించారు.

Related posts

డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

ప్ర‌తి ఆదివారం ప్రాప‌ర్టి ట్యాక్స్ ప‌రిష్కారం డే

Satyam NEWS

విజయదశమి నాడు పాలపిట్ట దర్శనం

Satyam NEWS

Leave a Comment