కర్నూలు సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం తో పాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.. సమావేశంలో మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎంపి బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఇతర కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో రోగుల కందించే అన్ని సేవలు ఆన్లైన్ అయ్యే విధంగా కంప్యూటరైజ్డ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇండెంట్స్ ఇంకా మాన్యువల్ గా ఉంటున్నాయని, ఏదీ ఆఫ్ లైన్ లో ఉండకూడదని మంత్రి అన్నారు.
previous post
next post