30.7 C
Hyderabad
April 24, 2024 00: 58 AM
Slider హైదరాబాద్

బస్తీ దవాఖాన ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

#MLA Beti Subhashreddy

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ డాక్టర్ ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ లోని మహేష్ నగర్ లో  బస్తీ దవాఖానాను ఉప్పల్ ఎమ్మెల్యే   బేతి సుభాష్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి లతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఉచిత చికిత్సలు  అందుబాటులో ఉండాలనే సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని అన్నారు. ఇక్కడ ప్రథమ చికిత్సలు  చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని ఇలాంటి సమయంలో బస్తీ దవాఖాన లు  ఎంతో దోహదపడతాయని అన్నారు.

కరోనా వైరస్ కట్టడికి ఇలాంటి బస్తి దావఖానాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ ,మెడికల్ ఆఫీసర్ వీరాంజనేయులు, కాప్రా మండల తాసిల్దార్ గౌతమ్ కుమార్, జి హెచ్ ఎం సి డిప్యూటీ కమిషనర్ శైలజ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సంపత్, డాక్టర్ స్వప్న, డాక్టర్ మాధురి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ గీత పాల్గొన్నారు.

ఇంకా, జిహెచ్ఎంసి ఈఈ కోటేశ్వరరావు, సంతోష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామ రావు, టిఆర్ఎస్ నాయకుల మణిపాల్రెడ్డి, బేతాల బలరాజ్, సురేందర్ పెంచాల, కాసం మహిపాల్ రెడ్డి, సీతా రామిరెడ్డి, బాల్ నర్సింహ,  కందుల లక్ష్మీనారాయణ, రామతులసి, నాగేశ్వర రెడ్డి, గోవర్ధన్, మట్ట రాజేశ్వర్ రెడ్డి, నారా జనార్దన్,  నారాయణ కాలనీ సంక్షేమ సంగం నాయకులు  షణ్ముగం, వెంకట్ రెడ్డి, రాజేశ్వర్,రాంచందర్ రావు, సంగయ్య,  తదితరులున్నారు.

Related posts

రేపు చీఫ్ జస్టిస్ గా ఎస్‌ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం

Satyam NEWS

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి

Bhavani

వైఎస్ మరణంపై  జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

Satyam NEWS

Leave a Comment