37.2 C
Hyderabad
March 28, 2024 17: 46 PM
Slider నల్గొండ

కరోనా చికిత్సలలో ప్రభుత్వ నిబంధనలు విధిగా అమలు చేయాలి

#DIGRanganath

కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలలో ప్రభుత్వం, వైద్య శాఖ నిర్ణయించిన ధరల ప్రకారమే ఛార్జ్ చేయాలని జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు.

సోమవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో పోలీస్, వైద్య శాఖ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు, ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఐజి రంగనాధ్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో ధరల పట్టిక విషయంలో ప్రతి ఆసుపత్రి విధిగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందం

రేమిడిసివర్, కోవిడ్ మెడిసిన్ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ, డ్రగ్ అధికారులు, రెవిన్యూ, పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీనివల్ల రేమిడిసివర్ ఇంజెక్షన్ల కొరతను అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

రేమిడిసివర్ ఇంజెక్షన్ నేరుగా ఆసుపత్రులు కొనుగోలు చేయడానికి కోవిడ్ చికిత్సలు చేస్తున్న ప్రతి ఆసుపత్రిని జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకువచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. ప్రజారోగ్యం విషయంలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విపత్కర పరిస్థితులలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సైతం ఇలాంటి కష్ట కాలంలో వ్యాపార ధోరణితో కాకుండా కొంత సేవాభావాన్ని ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. రికార్డులు మాయం చేసే అసూపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని అవసరమైతే ఆసుపత్రులను సీజ్ చేయడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.

రేమిడిసివర్ ఇంజెక్షన్ల కొరత

నల్లగొండ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రేమిడిసివర్ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉన్నదని, కొంత మంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అలాంటి వారి పట్ల చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కోవిడ్ తో బాధపడుతూ ఆసుపత్రులలో చేరిన వారి వివరాలు, రికార్డులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. కరోనా కష్ట కాలంలో అడుపత్రుల నిర్వాహకులు మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నదని, వ్యాపార ధోరణితో కాకుండా సేవా భావంతో కోవిడ్ రోగులకు సేవలందించి మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులుగా తాము అన్ని స్థాయిలలో అధికార. యంత్రాంగానికి వెన్నంటి నిలవడంతో పాటు ప్రజల కోసం అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అన్నిమల్ల కొండల్ రావు మాట్లాడుతూ లక్షణాలు లేనటువంటి కేసులను ఆసుపత్రులలో చేర్చుకోవద్దని ఆసుపత్రులకు అదేశాలిచ్చామని తెలిపారు. ఏ ప్యాకేజికి ఎంత ఛార్జ్ చేయాలనే విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు చార్జీల పట్టిక విధిగా ప్రతి ఆసుపత్రిలో తెలుగులో ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

హెచ్.ఆర్.సి.టి. స్కాన్ 3,500 రూపాయలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడం కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కోవిడ్ కంట్రోల్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నామని డిఎంహెచ్ఓ తెలిపారు.

సమావేశంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సిఐలు నిగిడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, బాలగోపాల్, ఎస్.ఎం.బాషా, సదా నాగరాజు, ఐఎంఏ అధ్యక్షుడు పుల్లారావు, డ్రగ్ ఇన్స్ పెక్టర్ వర ప్రసాద్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, యామ దయాకర్, ఆసుపత్రుల నిర్వాకులు, స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Related posts

శ్రమకు ప్రత్యామ్నాయం లేదు

Satyam NEWS

దళితుడి హోటల్ కూల్చేసిన చేసిన దుండగులను అరెస్టు చేయాలి

Satyam NEWS

ఎన్ ఆర్ ఐ తో కుమ్ముక్కు…. 6 ఎకరాలు హాం ఫట్

Satyam NEWS

Leave a Comment