ఇంట్లో పెట్రోలు నిల్వ ఉంచుకోవడం ప్రమాదకరమని తెలిసినా అదే పని చేసి ప్రమాదంలో చిక్కుకున్నది ఒక కుటుంబం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బిటిపి రోడ్ ఎస్సి కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు అతి తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో పెట్రోల్ ను నిల్వ ఉంచుకోవడం తో నిప్పంటుకుందని ప్రాధమికంగా తేలింది.
వారు ఇంట్లో దాదాపు 20 లీటర్ల పెట్రోలు నిల్వ ఉంచడం తో ప్రమాదశాత్తూ చెలరేగిన మంటలు ఇద్దరిని కాల్చాయి. నాగమ్మ అనే ఆమె, ఆమె మనుమడు మంటల్లో చిక్కుకున్నారు. హుటాహుటాన సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. మంటలను అదుపు చేసి క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.