జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, కాలవ శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రేషన్‌కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని మంత్రి తెలిపారు. జర్నలిస్టులకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలనే అంశంపై సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం జర్నలిస్టులను కూడా మోసం చేసింది. ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ గత ప్రభుత్వం మోసం చేసింది. జర్నలిస్టులపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చింది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.