35.2 C
Hyderabad
April 20, 2024 15: 43 PM
Slider విజయనగరం

ఇళ్లను కాదు ఊళ్లనే కడుతున్నజ‌గ‌న్ ప్రభుత్వం

#PushpaVani

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను, ఇళ్లను మంజూరు చేయడం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం జ‌గ‌న్ దేనని  ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు.  రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా జియ్యమ్మవలస లో ఇళ్ల పట్టాలు… ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ  ఆర్థిక స్థోమత లేక పిల్లలని చదివించుకునే పరిస్థితి లేని ప్రతి అక్కకు ఒక అన్నలా అండగా ఉంటూ అమ్మఒడి అందించారన్నారు.

అలాగే 45 ఏళ్ల నుండీ 65 ఏళ్ల‌ మద్య వయస్సులో వున్న ఎస్.సి., ఎస్.టి., మైనార్టీ మహిళలకు వై.ఎస్.ఆర్. చేయూత పధకం క్రింద 4 ఏళ్ల‌కు 75 వేల రూపాయాలకు గాను మొదటి విడతగా 18,750లు మహిళల వ్యక్తిగత ఖాతాలో జమచేయడం,అలాగే వై.ఎస్.ఆర్. ఆసరా వడ్డీ లేని రుణాలు అందించడం సీఎం మహిళా  పక్షపాతి అనడానికి నిదర్శనం అన్నారు.  

నాకు ఓటు వేయకపోయిన అర్హులైన అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసారన్నారు. జిల్లాలో సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లు అలాగే బి.సి.కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు, మార్కెటింగ్ లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారని, మహిళా మంత్రిగా నేను గర్వంగా చెబుతున్నానన్నారు.

త‌మ పొరుగు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటనకు చలించి ఆ ఆడబిడ్డ పేరుతోనే దిశ చట్టం ప్రవేశపెట్టారన్నారు. ఈ చట్టాన్ని ప్రక్క రాష్ట్రాల వారు కూడా దిశ చట్టం వివరాలు తెలుసుకొని అమలు చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు.

త‌మ‌ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు పొందడానికి మీరు ఎక్కడికి వెళ్లనవసం లేకుండా సీఎం ఒక్క మీట నోక్కితే నేరుగా మీ వ్యక్తిగత ఖాతాలోనికి జమ అవుతున్నాయన్నారు.

కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినా… ఏ పధకాన్ని ఆపకుండా అమలు చేసే ఘనత, పింఛన్లు ఉదయానే తలుపుతట్టి అరించే ఘనత సీఎం జ‌గ‌న్ కే దక్కిందన్నారు. 

ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, హౌసింగ్ డి.ఇ,  తహశీల్దార్, ఎం.పి.డి.ఓ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మబ్బులతో కమ్మేసిన ఆకాశం.. చిరుజల్లులతో ఉపశమనం..!

Satyam NEWS

జగన్, కేసీఆర్ లపై విల్లంబు ఎక్కుపెట్టిన కమలనాథులు

Satyam NEWS

పోలీస్ నియామకాలకు అడ్డదారులు ఉండవు

Satyam NEWS

Leave a Comment