27.7 C
Hyderabad
March 29, 2024 03: 10 AM
Slider కడప

పేదల ఆశలను అడియాశలు చేస్తున్న జగన్ ప్రభుత్వం

#CPIKadapa

పేదల సొంతింటి పట్ల నిర్లక్ష్యం వీడి, పూర్తైన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య  డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన  టిడ్కో ఇళ్ళను శిథిలావస్థకు చేరకముందే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని మంగళవారం కడప లోని స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్, సరోజినీ నగర్ వద్ద గల జి ప్లస్ త్రీ టిడ్కో ఇళ్లవద్ద కొంతమంది లబ్ధిదారుల తో కలిసి  నిరసన వ్యక్తం చేశారు.

16 నెలలుగా పట్టించుకోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పూర్తయిన ఇళ్ల సముదాయాలలో కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే సీఎంగా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద బ్యాంకుల తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంత లబ్ధిదారు లoదరికి ఉచితంగానే ఇల్లు ఇస్తామని చెప్పి నేడు ఆ ఇళ్ళ ఊసే ఎత్తడం లేదని, రివర్స్ టెండరింగ్ పేరిట కొండను తవ్వి ఎలుకను కూడా పట్టడం లేదని వారు దుయ్యపట్టారు.

ఇళ్ల కేటాయింపులో నిర్లక్ష్యం తగదు

గత ప్రభుత్వ హయాంలో షేర్ వాల్ టెక్నాలజీ తో జి ప్లస్ త్రీ (జి+3) ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి  కడప జిల్లాలో ల దాదాపు  155 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం పూర్తిచేసిన ఇళ్లను డబ్బులు కట్టిన లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 16 నెలలుగా పేదల గూడు పట్ల మీనమేషాలు లెక్క వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదన్నారు.

చంద్రబాబు డబ్బులు కాదు జగన్మోహన్రెడ్డి డబ్బులు కాదు ప్రజల పన్నులతో నిర్మించిన ఈ ఇల్లు లు శిధిలావస్థకు చేరకముందే పేదలకు ఇల్లు ఇవ్వాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకు  నెంబర్ల వారీగా ప్లాట్ లు  కేటాయించినప్పటికీ ఇతర మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసి స్వాధీనం చేయడంలో  తాత్సారం చేస్తున్నారని రోడ్లు,కరెంటు వైరింగ్ ,నీటి సరఫరా తదితర వసతులను క వెంటనే  కల్పించాలన్నారు.

రివర్స్ టెండర్ల తో కాలయాపన

కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ,ఎర్రగుంట్ల, రాయచోటి, రాజంపేట ,బద్వేల్, పులివెందుల, మైదుకూరు, పట్టణాల్లో మొత్తం 19,232 ఇల్లు మంజూరైతే కేవలం 12,907 మాత్రమే గత ప్రభుత్వ హాయంలో పూర్తయినాయి కాబట్టి నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ప్రభుత్వం స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.

300,360,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ టిడ్కో పర్యవేక్షణలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండర్ల ద్వారా కాలయాపన చేస్తున్నదని వారు విమర్శించారు. 

నవరత్నాలు లో భాగంగా అర్హులైన పేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని హంగులతో సౌకర్యవంతమైన ఇల్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమo పట్ల చిత్తశుద్ధి కరువైందని వారు విమర్శించారు.

కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక హక్కులు గా కనీస మౌలిక సదుపాయాలు  ముఖ్యంగా పేదలకు గూడు సమకూర్చేందుకు సిపిఐ నేతృత్వంలో అనేక మార్లు ఇళ్లస్థలాలు పోరాటాలు నిర్వహించామన్నారు. అర్హులైన పేదలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేక సంవత్సరాల తరబడి అద్దె ఇళ్లల్లో మగ్గిపోతు అద్దెలు కట్ట లేక ఊహించని ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు.

జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి

పేదల ఆశలను జగన్ ప్రభుత్వం అడియాశలు చేసిందన్నారు.. తరుణంలో సామాజిక న్యాయం దిశగా ఇల్లు ఇంటి స్థలాల పంపిణీపై జగన్ ప్రభుత్వం నిక్కచ్చిగా చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. లేకపోతే లబ్ధిదారులను సమీకరించి ఇంటి ఆక్రమిత స్వాధీన భూ పోరాటానికి సమాయత్తమవుతామని వారు హెచ్చరించారు.

ఇల్లు ఇంటి స్థలాల పట్ల ప్రభుత్వ తిరోగమన చర్యలపై  వివిధ రూపాల్లో నిరసనలు, ఇళ్ళు స్వాధీన కార్యక్రమాలు ఉంటాయని ఈ ఇళ్ల స్థలాల పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ,నాయకులు సావంత్ సుధాకర్, మద్దిలేటి, మునెయ్య, లింగన్న, మల్లిఖార్జున, భాగ్యలక్ష్మి,వీరాంజనేయులు, నారాయణ,ఓబులయ్య,ఈశ్వరయ్య,బుజ్జి, లక్ష్మీదేవి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

10 రెట్లు వేగంగా కరుగుతున్న హిమాలయాలు

Sub Editor

వైజ్ఞానిక స్పృహ సమాజ అభివృద్ధికి మూలం

Bhavani

ములుగు జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

Leave a Comment