30.7 C
Hyderabad
April 19, 2024 08: 50 AM
Slider గుంటూరు

యజ్ఞం లా ఇళ్ల నిర్మాణం: నరసరాపుపేట ఎమ్మెల్యే

#MLA NRT

ఇళ్ల పట్టాల పంపిణీ ఒక యజ్ఞం లా ఎలా చేశామో ,ఇళ్ల నిర్మాణం కూడా అలానే చేపట్టాలని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి పిలుపునిచ్చారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట లోని భువనచంద్ర టౌన్ హాల్  లో ఎమ్మెల్యే డాగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన  “పేదలందరికి ఇళ్ళు – జగనన్న కాలనీలు” పథకం లో భాగంగా మెగా గ్రౌండింగ్ మేళా అవగాహన సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి దేవి, ఆర్డీఓ పార్థసారధి ఇతర అధికారులు,సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

తొలిదశలో చేపట్టే ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసే లక్ష్యం తో జులై 1,3,4 తేదీల్లో మెగా గ్రౌండింగ్ మేళా ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా రోజుకు 10 వేల గృహాలకు గ్రౌండింగ్ లక్ష్యం తో జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

తొలివిడత గా నరసరావుపేట పట్టణంలో 2,200 మంది మెగా గ్రౌండింగ్ మేళా లో నిర్మాణం మొదలు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

వారందరికీ బస్సులు ఏర్పాటు చేసి వెంచర్ వద్దకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఇంత గొప్ప పథకాన్ని, ఇంత మంచి మనసున్న ముఖ్యమంత్రి ని తన సర్వీసులో ఎక్కడా ,ఎన్నడూ చూడలేదని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రశంసించారు.

30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ ఒక చరిత్రలో లిఖించదగ్గ ఘట్టమని, ఇళ్ల నిర్మాణం కూడా అదే విధంగా జరగాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు.

ఇళ్ల నిర్మాణం నాణ్యత తో, త్వరితగతిన పూర్తయ్యేలా నిబద్ధతతో పనిచేస్తామని హౌసింగ్ జాయింట్ కలెక్టర్ అనుపమాంజలి తెలిపారు.

నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృషితో ఒకేచోట 100 ఎకరాల భారీ వెంచర్ ఏర్పాటు చేశామని, అక్కడ ఇంకో పట్టణం ఏర్పడుతుందని జేసీ దినేష్ కుమార్ అన్నారు.

Related posts

లాక్ డౌన్ లోనూ 215 కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పులు

Satyam NEWS

కొత్త ఏడాది లో కొత్త జిల్లా ఏర్పాటుకు శ్రీకారం

Satyam NEWS

అందాల అనిత సాంగ్ రిలీజ్

Satyam NEWS

Leave a Comment