28.7 C
Hyderabad
April 20, 2024 04: 20 AM
Slider ఖమ్మం

ప్రతి పేదవారికి ఇళ్ళ పట్టాలు

#puvvada

అర్హులైనా ప్రతి పేదవారికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. అర్హుల్కెన లబ్ధిదారులు నేటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరల దరఖాస్తు చేసుకునే  అవకాశం కల్పించి జి.ఓ నెం. 58, 59ను పొడిగిస్తున్నట్లు మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.  అదివారం ఖమ్మం నగరం 57వ డివిజన్‌ వికలాంగుల కాలనీలో 460 మంది పేదలకు జి.ఓనెం.58,59 పట్టాలను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలసి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓనెం.58, 59 పథకం క్రింద ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు  వారికి పూర్తి హక్కు కల్పించేందుకు   రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లోనే మొదటిగా జి.ఓనెం. 58, 59 పథకం క్రింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్దం చేసి  మునుపెన్నడూ లేని విధంగా   ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలనే   ఉద్దేశంలో జరిగిన క్యాబినెట్‌లో మంత్రులం అందరూ కలిసి జి.ఓనెం.58, 59 పథకాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి గడువును పొడిగించారని పేర్కొన్నారు.  ఇంకా దరఖాస్తు చేసుకొని వారు మళ్ళీ ధరఖస్తు చేసుకోవాలని సూచించారు. అర్హుల్కెన ప్రతి ఒక్కరికీ  పట్టాలు అందిస్తామని మంత్రి  స్పష్టం చేశారు.

ఖమ్మం నగరంలోనే నిర్మించిన 2వేల మందికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందజేశమని అన్నారు.  ఇళ్లు రాని వారికి సొంత స్థలం కలిగిన వారికి రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరుపున అందిస్తామని అన్నారు.  పేదల పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్దితో వ్యవహరిస్తున్నదని మంత్రి అన్నారు. ఖమ్మం నగరంలో గతంలో  త్రాగునీటి కొరత ఉండేదని,  కిలోమీటర్ల  నుండి నీరు తెచ్చుకునే పరిస్థితి నుండి తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే పకడ్బందీ ప్రణాళికతో నేడు మీ వద్దేకే మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 12లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మించడమైందన్నరు.  ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నళ్లా ద్వారా స్వచ్చమైన త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.    రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు గృహ వినియోగానికి  100 యునిట్లలోపు అందించే ఉచిత విద్యుత్‌ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు.  

కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ జి.ఓ నెం.58, 59 పథకం క్రింద ఎలాంటి ఆదెరువు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం వారి ఇంటిపై వారికి పూర్తి హక్కు కల్పించాలనే సంకల్పంతో ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల చొరవతో 2 వేల 500  మంది పేదలకు పెద్దఎత్తున పట్టాలను అందించడం జరిగిందన్నారు.

Related posts

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

Satyam NEWS

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌

Bhavani

బోర్డు తిప్పేసిన అన్నమయ్య చిట్స్ అండ్ డిపాజిటర్స్

Satyam NEWS

Leave a Comment