35.2 C
Hyderabad
April 20, 2024 15: 12 PM
Slider ముఖ్యంశాలు

కరోనా ఎఫెక్ట్: కడసారి చూపు కూడా కరువేనా?

road block

జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ పక్కన చిలుకవాడ, 4వ వార్డులో నివాసం ఉంటున్న వేముల మురళి (56) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు శుక్రవారం మధ్యాహ్నం హార్ట్ ఎటాక్ తో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

ఆయన కుమారుడు శివ సాయి ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అంత్యక్రియలు జరగాలంటే అబ్బాయి చెన్నై నుండి రావలసి ఉంది. అయితే నేషనల్ లాక్ డౌన్ కారణంగా అది వీలు కావడం లేదు. ఏం చేయాలి? కొడుకు ఉండి కూడా వేరే వారు తలకొరివి పెట్టాలా? తమకు ఎవరైనా సాయం చేస్తారేమోనని నేతల సహాయం కోసం బంధువులు, మృతుడి తోటి ఉపాధ్యాయులు పరుగులు పెడుతున్నారు.

చెన్నై నుండి అబ్బాయిని జగిత్యాలకు రప్పించేందుకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీలవుతుందా?

Related posts

ప్రభుత్వ ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారితో జరభద్రం…!

Satyam NEWS

మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలి

Satyam NEWS

జ్ఞాన్‌వాపి కేసులో హిందువుల డిమాండ్ కు ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment