27.7 C
Hyderabad
April 26, 2024 03: 26 AM
Slider తెలంగాణ

ఇలాగైతే ఎలా యాదగిరి నర్సింహ స్వామీ?

CM-KCR-visits-Yadadri-Temple-32

ఓ తెలుగు  సినిమాలో గురు శిష్యుల మధ్య  ఓ డైలాగు వుంది .. చెప్పిన పని సరిగా  చేయని శిష్యుడిని ఉద్దేశించి  గురువు  ఇలా అంటాడు..” ఏమిరా! నీ వల్ల దేశానికి  ఏమి ప్రయోజనం రా..!” అని. ప్రతి రోజు  ఏదో  ఒక  పని చెప్పడం ..అది సక్రమంగా చేయకుండా అభాసు పాలవడంతో గురువు కి చిర్రెత్తుకొస్తుంటుంది. చివాట్లు తినడం  శిష్యులకు అలవాటుగా మారుతుంది . ఇదిగో…ఇప్పుడు  సరిగ్గా అటువంటి  పరిస్థితినే తెలంగాణ  సిఎం కెసిఆర్ ఎదుర్కొంటున్నారు . కీలక  అంశాలను వ్యూహాత్మక  ప్రణాళికలను ఎంతో  పకడ్బందీగా ప్లాన్  చేసి వాటిని అమలు చేయమని ఆదేశాలు జారీ  చేస్తే వాటిని  బుట్టదాఖలు చేస్తున్న ప్రియ  శిష్యులతో పాటు అధికారులపైన కూడా  మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న యాదాద్రి పునరుద్ధరణ  పనుల పరిశీలనకు కేసీఆర్‌  స్వయంగా  వెళ్ళినప్పుడు అధికారుల  స్పందన..నిరాసక్తతను  చూసి కంగు తిన్నారు.యుధ్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సి ఉండగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి.  ఇలా  అయితే  ఎలా ?అని గట్టి  వార్నింగ్ ఇచ్చారు . మీది  నత్త నడక కంటే  అధ్వాన్నంగా ఉంది . నోటితో  మాట్లాడుతూ నే నొసటితో ఆగ్రహించారు. యాదాద్రి పునరుద్ధరణ  పనుల ప్రధాన పర్యవేక్షకులకు క్లాసు పీకారు. సుమారు  ఐదు గంటలకు పైగా అక్కడే  గడిపిన  కేసీఆర్‌ తాను మళ్లీ ఆకస్మిక  తనిఖీకి తాను వస్తానంటూ హెచ్చరిక  జారీ  చేసి మరీ వెళ్ళారు.పని చేయని అధికారులతో  ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు ..ఇకపై  జాగ్రత్తగా ఉండండి !అంటూ  హైదరాబాద్ కు హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణమయ్యారు కేసీఆర్‌ . దీనితో అధికారగణంలో చలనం  మొదలైంది.తన ఇష్టదైవమైన యాదగిరి  లక్ష్మీ నరసింహ స్వామిని సందర్శనకు సి ఎం  మరోసారి  వచ్చేలోగా  పనులన్నింటిని అఘమేఘాలపై పూర్తి చేసేందుకు అధికారగణం ఉరుకులు పరుగులు  పెడుతోంది. తమిళనాడు నుంచి  అదనంగా మరికొందరు శిల్పులను రప్పించి వీలైనంత త్వరగా నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

Related posts

గుజరాత్ లో విద్వేషం రెచ్చగొట్టేవారిని ఓడించండి

Satyam NEWS

సెలబ్రేషన్స్: సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా మాగంటి

Satyam NEWS

నిర్మల్ మునిసిపల్ ఎన్నికలకు బిజెపి సన్నాహకాలు

Satyam NEWS

Leave a Comment