35.2 C
Hyderabad
April 20, 2024 16: 45 PM
Slider సంపాదకీయం

వామ్మో ఒకటో తేదీ: ఆర్ధిక శాఖ గుండెల్లో గుబులు

#Y S Jaganmohan Reddy

ఒకటో తేదీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ హడలెత్తిపోతున్నది. డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి? జీతాలు ఎలా చెల్లించాలి? ఇదే ఆలోచన. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పథకాల అమలు, రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి నెలా 10వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఓ అంచనా.

ఇప్పటికిప్పుడు ఆమేరకు నిధులు ప్రభుత్వం వద్ద లేవు. జీతాల కోసం కచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లిపోయారని, ఇకపై అప్పు పుట్టదని వార్తలొస్తున్నాయి. మరి ఈ ఒకటో తేదీ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతాయా లేదా..? ఇదే తెలియడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి అర్జెంటుగా జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్లు చెల్లించేందుకు సుమారు రూ. 6500 కోట్లు కావాలి. అదే విధంగా సామాజిక పెన్షన్లు చెల్లించేందుకు రూ. 1500 కోట్లు కావాలి. ఇప్పటికే తెచ్చిన అప్పుల కోసం వడ్డీగా దాదాపు రూ. 3000 కోట్లు ఒకటో తేదీ కల్లా చెల్లించాలి.

ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సుమారుగా రూ. 2500 కోట్లు చెల్లించాల్సి ఉంది. జీతాలు వడ్డీలకు ఏదోక విధంగా సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖను ఆదేశించారట. ప్రతిపక్షాలు జీతాల చెల్లింపుపై ప్రతి నెలా రాద్ధాంతం చేస్తున్నందున ఈ నెల ఎలాగైనా జీతాలు ఒకటో తేదీకల్లా చెల్లించాలని ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు.

అయితే ఒక్క పైసా కూడా లేని స్థితిలో ఎలా చేయాలా అని ఆర్ధిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నది. జులై లోనే జీతాలు 10 తేదీ ఇచ్చారు. గత పది రోజులుగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఎక్కడైనా అప్పు దొరుకుతుందా అని ఆయన వాకబు చేస్తున్నారు.

అదే విధంగా కేంద్రం నుంచి ఏమైనా నిధులువ విడుదల అవుతాయా అని కూడా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు చెల్లించాల్సిన ఉపాధి హామీ పథకం బకాయిలను రూ.500 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ముందుగా టోకెన్లు ఇచ్చిన వారికి మాత్రమే బిల్లులు చెల్లించి ప్రస్తుతానికి గండం గట్టెక్కాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దాంతో రెండు వేల కోట్ల రూపాయల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది.

Related posts

ఏప్రిల్ 1 నుంచి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు ప్రారంభం

Satyam NEWS

రాజానగరం హైస్కూల్ లో దారుణం

Satyam NEWS

ఏపీ మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్

Satyam NEWS

Leave a Comment