40.2 C
Hyderabad
April 24, 2024 17: 40 PM
Slider శ్రీకాకుళం

పదో తరగతి పరీక్షల్లో హిందీ భాషలో ఎలా స్కోర్ చేయాలి?

hindi subject

రాబోయే పదో తరగతి పరీక్షల్లో హిందీ భాష లో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి? ఈ అంశంపై ప్రముఖ హిందీ పండితుడు బ్రహ్మాజీ శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస జెడ్ పి హైస్కూల్ లో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు హిందీ అవకాశం కల్పిస్తుందని అందువల్ల దానిపై శ్రద్ధ చూపాలని బ్రహ్మాజీ చెప్పారు.

పరీక్షల్లో ఏ విధంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయాలో ఆయన వివరించారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్ధులకు అవగాహన చేయించడంపై విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐ డి వి ప్రసాద్, హిందీ టీచర్ జీ వినయ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమం లో భాగంగా విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారి అనుమానాలు నివృత్తి చేశారు.

Related posts

గంగాడి సుదీర్ ‘కవనం’ ముఖచిత్రం ఆవిష్కరణ

Satyam NEWS

కమలదళాన్ని కోరరాని కోరిక కోరిన కుందూరు జానారెడ్డి

Satyam NEWS

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న బత్యాల…

Bhavani

Leave a Comment