36.2 C
Hyderabad
April 25, 2024 22: 04 PM
Slider ముఖ్యంశాలు

రాబోయే సమ్మెను దృష్టిలో ఉంచుకుని HRA లో మార్పులు

#AndhraPradeshSecretariat

ఆంధ్రప్రదేశ్ లో ఉధృతంగా సాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను, రాబోయే సమ్మెను దృష్టిలో పెట్టుకుని కాబోలు జగన్ ప్రభుత్వం HRA లో మార్పులు చేసింది. హెచ్‌వోడీ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు HRA 8 శాతం ఉండేది. దీన్ని 16 శాతానికి పెంచుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన అన్ని హెచ్‌వోడీ ఆఫీసుల్లో ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించనుంది. గతంలో ఉద్యోగుల కార్యక్షేత్రం జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీల్లో హెచ్‌ఆర్‌ఏను నిర్ణయించిన విషయం తెలిసిందే. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఏర్పాటైన రాష్ట్ర  సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో  సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించేది. దాన్ని 8 శాతానికి కుదించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 16 శాతానికి మార్చింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related posts

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

Sub Editor

వెల్ కం: మహంకాళి అమ్మవారి కుంకుమార్చన

Satyam NEWS

తిరుపతి రవాణా విభాగం లో వేడుకగా ఆయుధ పూజ

Satyam NEWS

Leave a Comment