Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

శ్రీవారికి అజ్ఞాత భక్తుల విరాళం 14 కోట్లు

tirupati-1

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అజ్ఞాత భక్తులు రూ.14 కోట్ల విరాళమిచ్చారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా స్థిరపడిన తెలుగు ప్రవాసీయులు ఈ విరాళాన్ని ఇచ్చినట్టు టీటీడీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న ఆ కుటుంబ సభ్యులు రూ. 14 కోట్ల డీడీని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ డబ్బును టీటీడీ నడుపుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సిందిగా వారు కోరినట్లు తెలిపారు. గతేడాది కూడా ఈ ఇద్దరు ఎన్నారైలు టీటీడీకి రూ. 13.5 కోట్ల విరాళాన్ని ఇవ్వడం విశేషం. వారి పేర్లను బయటకు చెప్పవద్దని కోరడంతోనే తాము దాతల పేర్లను వెల్లడించడం లేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా, విరాళమిచ్చిన దాతలిద్దరూ స్నేహితులని, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారని, అమెరికాలో వారిద్దరూ కలిసి వ్యాపారాన్ని నడుపుతున్నట్టు పేర్కొన్నారు.

Related posts

జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి

mamatha

బహుభాషా భారీ బడ్జెట్ చిత్రం సేవాదాస్ సెన్సార్ పూర్తి!!

Satyam NEWS

నాడు తెలంగాణ కోసం.. నేడు బకాయిల కోసం బతుకమ్మ ఆట

Satyam NEWS

Leave a Comment