36.2 C
Hyderabad
April 18, 2024 12: 39 PM
Slider హైదరాబాద్

అర్ధ రాత్రి హైదరాబాద్ కోఠి లో భారీ అగ్నిప్రమాదం

#Koti Fire Accident

హైదరాబాద్ కోఠి లో అర్ధ రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోఠి ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న ఒక బట్టల షాపులో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

సుల్తాన్ బజార్ మార్కెట్ గా పిలిచే అక్కడ అన్నీ బట్టల దుకాణాలే ఉంటాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అంటున్నారు.

భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లుగా సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.  

మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లు వినియోగిస్తున్నారు. సుల్తాన్ బజార్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

Related posts

దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

30 పాఠ‌శాల‌ల‌ను ఎత్తివేసే యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం…!

Satyam NEWS

రూ.2 కోట్ల ‌ రోడ్డు ప‌నులు, పార్క్ ల‌ను ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment