34.2 C
Hyderabad
April 23, 2024 14: 09 PM
Slider విశాఖపట్నం

విశాఖలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

#ganja

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ Ch. శ్రీకాంత్ ఆదేశాల మేరకు, విశాఖపట్నం SEB జాయింట్ డైరెక్టర్ బమ్మిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో గంజాయి అక్రమ రవాణా పైన సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

వరుసగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడిన సెబ్ పోలీసులు వేపగుంట జంక్షన్ నుంచి హనుమంత వాక వరకు సినీ ఫక్కీ లో చేజింగ్ చేసి 150 కేజీ ల గంజాయి, breeza carను స్వాధీనం చేసుకున్నారు. నగరం లోకి భారీగా గంజాయి సరఫరా జరుగుతున్నట్లుగా అందిన సమాచారం మేరకు SEB అధికారులు వేపగుంట జంక్షన్ వద్ద రూట్ వాచ్ నిర్వహించారు. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును

అడవివరం జంక్షన్ మీదుగా హనుమంతవాకకు మళ్ళించారు. మరో SEB అధికారుల బృందం హనుమంతు వాక వద్ద కాపు కాయడంతో గంజాయితో సహా కారును వదిలేసి నిందితుడు పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కారును గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితులను

గుర్తించి త్వరలోనే అరెస్టు చేయడంతో పాటు నగరంలో గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని SEB జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.ఈ కేసును చేదించడంలో సమర్థంగా అడ్డుకున్న ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ బి శ్రీనాథుడు, సహచర సిబ్బందిని అభినందించారు.

Related posts

పేదల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి

Bhavani

సిర్పూర్ కాగజ్ నగర్ లో బిజెపి ప్రతిష్టను మరింత పెంచుతా

Satyam NEWS

విద్యుత్ కార్మికుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

Satyam NEWS

Leave a Comment