నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి హిమాయత్ నగర్ మినర్వా హోటల్ గల్లీ లో ఓ ఇంట్లో జరిగిన ఈ చోరీ సంచలనం కలిగించింది. ఇంట్లో పని చేస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తి చోరీ చేసి పరార్ అయ్యాడు. సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం , డైమెండ్స్ , గోల్డ్ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. ఇంటి యజమాని దుబాయ్ లో ఉండటంతో, అతని వద్ద పని చేసే అభయ్ కెడియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు పై కేసు నమోదు చేసి నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post