30.7 C
Hyderabad
April 19, 2024 10: 33 AM
Slider విజయనగరం

ఉత్త‌రాంధ్ర‌లో అదీ విద్య‌ల‌న‌గ‌రంలో భారీ దొంగ‌త‌నం..!

#vijayanagarampolice

ఉత్త‌రాంద్ర‌లో అదీ విజ‌య‌న‌గ‌రంలో జిల్లాలో ప్ర‌ధానంగా న‌గ‌రంలో భారీ దొంగ‌త‌నం జ‌రిగిప‌ట్టుకోండి చూద్దాం అంటూ అగంత‌కుడు స‌వాల్ విసిరిన ఘ‌ట‌న జ‌రిగింది. అదీ షాపున‌కు సెల‌వు రోజు నాడు దొంగ‌త‌నం జ‌రిపి మరీ పోలీసుల‌కు  ప‌రీక్ష పెట్టాడు…దొంగ‌త‌నం చేసిన వాళ్లు.జిల్లా కేంద్రంలోని గంట‌స్థంబం వ‌ద్ద ర‌వి జ్యూయ‌ల్లెరీ షాపులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున‌….అగంత‌కుడు  షాపు మీద నుంచీ గ్రిల్స్ క‌ట్ చేసి…లోప‌ల‌కు   చొచ్చు కుని వెళ్లి..అల్మారాలో ఉన్నబంగారు ఆభ‌ర‌ణాల‌న్నీ దోచేసాడు

ర‌మార‌మి 4 కేజీల బంగారాన్ని దోచేయ‌డంతో షాపుయ‌జ‌మాని ఒక్క‌సారి షాక్ తిన్నాడు. రోజు వారిలానే   ఉద‌యం షాపు త‌లుపు తెర‌వంగానే  లోప‌ల అల్మ‌రా మొత్తం బోసిపోయి ఉండ‌టం..అందులో ఉండా్ల్సిన ఆభ‌ర‌ణాల‌ను  ఏ ఒక్క‌టీ లేక‌పోవ‌డంతో దొంగ‌త‌నం జ‌రిగిందని తెలుసుకుని త‌క్ష‌ణం కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేసాడు. అక్క‌డి నుంచీ వ‌న్ టౌన్ పోలీసులు స‌మాచారం అందుకోవ‌డంతో సీఐ ముర‌ళీతోపాటు ఎస్ఐ అశోక్ కుమార్ లు ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చారు.

ఆ త‌ర్వాత ఏఎస్పీ అనిల్.కొద్ది సేప‌టికి ఎస్పీ దీపికా ఘ‌ట‌నా స్థ‌లికి వ‌చ్చారు. మొత్తం…షాపులో దొంగ‌త‌నం జ‌రిగిన తీరును పోలీస్ బాస్ క్షుణ్ణంగా ప‌రిశీలించారు.షాపులో అస‌లు  దారి ఎక్క‌డున్న‌దీ…తెలుస‌కుని…అప‌రిచ‌త వ్య‌క్తికి ఆ దారెలా తెలుసున‌ని ఎస్పీ ప‌రిశీలించారు. 

షాపులోప‌ల మెట్ల‌పై నుంచీ అగంత‌కుడు ప్ర‌వేశించిన వైనాన్ని…ఎస్పీ  నిశితంగా ప‌రిశీలించారు .దాదాపు రెండు అంత‌స్తుల మేడ పై నుంచీ అగంత‌కుడు..మెట్ల వ‌ద్ద  ఉన్న గ్రిల్ ను తొల‌గించి మెట్ల‌మీదుగా షాపులోప‌ల‌కు వ‌చ్చి..మొత్తం ఆభ‌ర‌ణాల‌ను చోరీ చేసాడు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…ఫింగ‌ర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్ తో ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని…సీపీ పుటేజ్ ను కూడ ప‌రశీలించామ‌ని  చెప్పారు.

తొంద‌ర‌లోనే  నిందితుడుని ప‌ట్టుకుంటామ‌న్నారు.  ఇదిలా ఉంటే ఇటీవల సీఎంఆర్ లో దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తే….ఈ షాపులో కూడా దొంగ‌త‌నం చేసిన‌ట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అగంతుడు ఛ‌త్తీస్ ఘ‌డ్ వాసిగా పోలీసులు గుర్తించిన‌ట్టు  స‌మాచారం.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

కూలిన బంగారు గని.. 38 మంది మృతి

Sub Editor

ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు VRO వెంకట రమణారెడ్డి

Satyam NEWS

తెలంగాణ ఉద్యమకారుడికి ఘన నివాళి

Bhavani

Leave a Comment