హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. చింతలపాలెం మండలం నక్కగూడెం పర్యటనలో ఉత్తమ్ వెల్లడించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి పద్మావతి ఓడిపోయారు. పద్మావతి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి.
previous post