36.2 C
Hyderabad
April 16, 2024 21: 14 PM
Slider ప్రత్యేకం

గుర్ల కేసులో పోలీసుల మానతాకోణం..బాధితురాలి భవిష్యత్ పైనే దృష్టి

#RajakumariIPS

రెండు రోజుల క్రితం… ఏపీలోని విజయనగరం జిల్లా గుర్ల పీఎస్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న డిగ్రీ విద్యార్ధిని కేసులో… విచారణ చేసిన పోలీసులు… ఆమె భవిష్యత్, భద్రతను దృష్టిలో పెట్టుకుని… కేసు తీవ్రతను తగ్గించే యత్నం చేసారు.

సోషల్ మీడియాలో వచ్చిన పుటేజ్ తో ఎస్పీ ఆదేశాలతో గుర్ల పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలి నుంచీ ఆమెను హాస్పిటల్ జాయన్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే…పోలీసు లే ఖంగితినే ఆధారాలు బయట పడ్డాయి.

అటు కన్నవారి ఇటు స్నేహితుల కళ్లు గప్పి..తనకు తానే గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి కాళ్లు,చేతులు కట్టి పడేశారని అందరినీ నమ్మించేలా చేసింది. ముళ్ల పొదలలో ఓ అమ్మాయి కట్టేసిపడి ఉందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు లో స్వయంగా ఎప్పీనే సంఘటనా స్థలానికి చేరుకోవడం…జాగిలాలతో దర్యాప్తు చేయడం.. చివరకు హాస్పిటల్ లో చికిత్స పొందిన అనంతరం తేరుకున్న ఆమెను పోలీసులు పూర్తిగా స్థాయిలో విచారించారు.

స్నేహితుడితో భీమవరం వెళ్లానని…ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు తెలిసిపోవడంతో… తనకు తానే.. బంధీ అయ్యానని పోలీసుల విచారణ లో వెల్లడైంది.కేసు నమోదైన మరుసటి రోజే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసారు. కేసు పూర్వపరాలను అందులో వాస్తవాలను మీడియా కు తెలియపరిచేందుకు ఎస్పీ కూడా సిద్ధమయ్యారు. కానీ…ఒక్క క్షణం… ఒకే ఒక్క క్షణం.. జిల్లా పోలీసు శాఖ… ఆమె భవిష్యత్ ను భద్రతను.. దృష్టిలో పెట్టుకుని నామ మాత్రం గా మీడియా కు ఓ నోట్ ను విడుదల చేసింది… పోలీసు శాఖ.ఏదైనా ఎదుగుతున్న యువతులు.. క్షణికావేశంలో తప్పటడుగులు వేసి కన్నవాళ్లనే కాక సమాజాన్ని తప్పు పట్టిస్తున్నారని చెప్పేందుకు.. గుర్ల కేసు ఓ ఉదాహరణ.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

రిక్వెస్టు: రేషన్ కార్డు లేనివారిని కూడా ఆదుకోవాలి

Satyam NEWS

గాడ్స్ సన్: సెంచరీలు దాటే వయసు సంస్కృతం నేర్పే మనసు

Satyam NEWS

టెక్వీస్సేన్ సాఫ్ట్వేర్ ప్రారంభించిన మంత్రి అవంతి

Satyam NEWS

Leave a Comment