30.7 C
Hyderabad
April 19, 2024 07: 10 AM
Slider విజయనగరం

మానవతా విలువలకు పట్టం కడుతున్న ఖాకీలు..!

#vijayanagarampolice

ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ లో పలు చోట్ల పోలీసులు..మానవత్వానికి పట్టం కడుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రం ఉత్తరాంధ్రలో ని విజయనగరం జిల్లాలో గడచిన కొద్ది నెలలుగా పోలీసులు..కాస్త కాఠిన్య హృదయాన్ని వదిలి ‘చేయూత’ కు విలువ నిస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్ లో కొత్తవలస, గజపతినగరం,బొబ్బిలి పోలీసు స్టేషన్ సిబ్బంది మానవత్వాన్ని చాటితే ఈ సెకండ్ వేవ్ లో కూడా లాఠీ పట్టాల్సిన చేతులతో సాయం చేసి పలువురు ప్రాణాలను కాపాడుతోంది.

తాజాగా విజయనగరం జిల్లా కేంద్ర హాస్పిటల్ వద్ద అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కరోనా సోకిన  ఓ అజ్ఞాత వ్యక్తిని  మహారాజ హాస్పటల్ కి తీసుకు వెళ్లుతుండగా దారిలోనే తుది శ్వాస విడిచారు.. అతని తో పాటు వచ్చిన బంధువు విజయనగరం యూత్ ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ మరియు కానిస్టేబులు షేక్ ఇల్తమాష్ కి ఫోన్ చేసి సహాయం కోరారు.

జిల్లాలోని డెంకాడ పోలీసు స్టేషనులో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఇల్తామాష్ తక్షణమే స్పందించి తనకు తెలిసిన అంబులెన్స్ ఓనర్ అ శివకు ఫోన్ చేసి, అంబులెన్స్ రప్పించారు.

అనంతరం క్షణం ఆలోచించకుండా పెద్ద చెరువు రోడ్డులో రిక్షా లో ఉన్న పార్దీవ దేహంను అంబులెన్స్ లోకి తరలించి దాసన్నపేట దగ్గర గల ఉన్న శ్మశానవాటికకు తరలించారు. అక్కడితో వారి మానవత్వం తగ్గ లేదు.

స్వయంగా తమ స్వంత ఖర్చులతో అంతిమ సంస్కారాలు పూర్తి చేసారు. క్లిష్టమైన సమయంలో కానిస్టేబుల్ ఇల్తామాష్ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా తక్షణం తనలో మానవత్వాన్ని తట్టిలేపి ఓ అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం నిజంగా అభినందనీయం.హేట్సాఫ్ పోలీసోడా.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Satyam NEWS

నరసరావుపేటలో భారీ ఎత్తు రేషన్ బియ్యం స్మగ్లింగ్

Satyam NEWS

ఆర్జీయూకేటీ -బాసర లో remedial పరీక్షలు

Satyam NEWS

Leave a Comment