27.7 C
Hyderabad
April 20, 2024 02: 49 AM
Slider కర్నూలు

దయనీయ స్థితిలో ఉన్న ముగ్గుర్ని ఆదుకున్న మానవ హక్కుల కమిషన్

#humanrights

ప్రభుత్వ ఉద్యోగిని కాదు…కూలీగా బతుకీడుస్తున్నా…!, ఆధార్ లేక కష్టాలు అంటూ మంగళవారం ఈనాడు దిన పత్రిక మెయిన్ ఎడిషన్ లో ప్రచురించిన వార్తలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తాడంకి రాజు అనూష దంపతుల కుమారులు భరత్ (8), భవిష్ (7) పుట్టినప్పటి నుంచి మానసిక వికలాంగులు. కనీసం కూర్చో లేరు…నుంచోలేరు. ఆ దంపతులకు కూలి పని చేసుకుంటేనే పూట గడిచేది. పిల్లలకు పింఛను ఇప్పించాలని గత 8 నెలలుగా అధికారులను మొర పెట్టుకున్నా ఫలితం లేదు. గ్రామ సచివాలయ రికార్డుల్లో రాజు ప్రభుత్వ ఉద్యోగి అని, కారు ఉందని, ఇన్ కంటాక్స్ కడుతున్నట్లుగా ఉందని, పింఛను రాదని చెప్పారు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నామని, వాహనం లేదని ధ్రువపత్రాలు అందజేసినా కనికరం చూపడం లేదని ఆ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారని ప్రభుత్వ ఉద్యోగిని కాదు…కూలీగా బతుకీడుస్తున్నా…! అంటూ ఈనాడు దినపత్రిక ప్రచురించింది.

అదే విధంగా కృష్ణాజిల్లా కొత్తూరు చెందిన వెంకట కార్తీక్ వయస్సు తొమ్మిదేళ్లు. ఈ బాలుడికి పుట్టుకతోనే కళ్లు కనిపించవు…శారీరక ఎదుగుదల లేక అవయవాలు లేక కదప లేని పరిస్థితిలో దివ్యాంగుడిగా ఉన్నారు. తండ్రి చనిపోయారు. తల్లి కూడా బిడ్డను వదిలేయడంతో ఆనాథగా మారిన కార్తీక్ సంరక్షణ బాధ్యతలను మేనత్త కోపూరి అంజనాదేవి చూస్తున్నారు. పింఛనుకు దరఖాస్తు చేస్తే…ఆధార్ లో చేతి వేలిముద్రలు, కనుపాపలు రికార్డు కావడం లేదని మంజూరు చేయలేదు. ఆధార్ ఉంటేనే సదరన్ సర్టిఫికెట్ ఇస్తామని వైద్యులు చెప్పారు. 3 ఏళ్ల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా భరోసా దక్కడంలేదని అంజనాదేవి వాపోయారని ఆధార్ లేక కష్టాలు అంటూ మరో కథనాన్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది.

ఈ వార్తలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జుడీషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జుడీషియల్ సభ్యులు డాక్టర్ గోచిపాత శ్రీనివాస రావు  స్పందించి స్వచ్ఛందంగా  కేసులను స్వీకరించారని కర్నూలు లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, వేల్పూరు గ్రామానికి చెందిన తాడంకి రాజు అనూష దంపతుల కుమారులు భరత్ (8), భవిష్ (7)లకు , కృష్ణాజిల్లా కొత్తూరు చెందిన తొమ్మిదేళ్లు వయసుకు చెందిన వెంకటకార్తీక్ కు ఆధార్ సరి చేయడంతో పాటు సదరం పోర్టల్ లో దరఖాస్తు చేయించి, పెన్షన్ మంజూరు  చేయించవలసినదిగా సంబంధిత  విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ V,WS&D కృష్ణాజిల్లా,  కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను నెల లోపు పూర్తి చేసి, వచ్చే నవంబర్ 30వ తేదీ లోపల ఇందుకు సంబంధించి నివేదికను కూడా తమకు  అందజేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది.

Related posts

గుర్ల కేసులో పోలీసుల మానతాకోణం..బాధితురాలి భవిష్యత్ పైనే దృష్టి

Satyam NEWS

అంబర్ పేటలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పటిష్ట భద్రత తో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఉప ఎన్నికలు

Satyam NEWS

Leave a Comment