31.2 C
Hyderabad
April 19, 2024 06: 47 AM
Slider వరంగల్

వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో వికాస బాల,బాలికలకు సానుభూతి దినోత్సవం

#Taslima

మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులలో ఎలాంటి తారతమ్యం లేకుండా స్వేచ్చ సమానత్వం కలిగి ఉండాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

గురువారం ములుగు లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఆవరణంలో వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో వికాస బాల,బాలికలకు సానుభూతి (జన్మదిన) వేడుకలు  నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన తస్లీమా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో  మనుషుల మధ్యలో అందరు ఉన్న (అనాధలుగా) ఒంటరిగా మిగిలిపోతున్నారని, ఇలాంటి తరుణంలో బంధాలు,బంధుత్వాల కన్న ఆత్మీయత, అభిమానం,సమానత్వం ఉండాలని ఆమె అన్నారు.

వీరి కోసం వర్డ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయం అని, నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే చిన్నప్పటి నుండే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. పట్టుదలతో చదివి,ఉన్నతంగా ఎదగాలని తస్లీమా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వర్డ్ సంస్థ డైరెక్టర్ సోలి సిస్టర్,ఎల్ఐసి ఆఫీసర్ సంపత్, కాసుల రవి కుమార్,మాధవి లత, తార సిస్టర్,ప్రిన్స్ పాల్ జ్యోతి సిస్టర్, కాన్వెంట్ సిస్టర్స్,వర్డ్ సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు.

Related posts

పేదరికం నిర్మూలనే టీడీపీ ధ్యేయం

Satyam NEWS

సీసీ కెమెరాల సాక్షిగా విజయనగరం జిల్లా లో సాగుతున్న పోలింగ్

Satyam NEWS

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం

Sub Editor 2

Leave a Comment