భార్య వేధింపులతో బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తన భార్య నిఖిత సింఘానియా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆవేదనతో అతను ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన భార్య తనను ఎలా వేధించిందో తెలిపాడు. పోలీసులు, చట్టం అన్నీ ఆమెకే అనుకూలంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సహా అందరికీ లెటర్ రాశాడు. ఉరి వేసుకునే సమయంలో తనకు న్యాయం కావాలంటూ మెడలో బోర్డ్ తగిలించుకున్నాడు. వరకట్న వేధింపులు, గృహహింస, బలవంతపు సెక్స్ కింద కేసులు పెట్టించి తనతో పాటు తన కుటుంబ సభ్యులందర్నీ ఆమె వేధించిందని 24 పేజీల లేఖ రాసి అందరికీ పంపాడు.
Note: Discussing suicides can be triggering for some. However, suicides are preventable. A few major suicide prevention helpline numbers in India are 011-23389090 from Sumaitri (Delhi-based) and 044-24640050 from Sneha Foundation (Chennai-based).