27.7 C
Hyderabad
June 10, 2023 03: 26 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఏం చేస్తాడు?

bhopal

పాపం ఐదుగురు పెళ్లాల మొగుడు. ఏం చేస్తాడు? ఎలాగోలా డబ్బులు సంపాదించాలి. అందుకే కొత్త మార్గం ఎంచుకున్నాడు. చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తే వాళ్లు బయటకు వచ్చి కంప్లయింట్ ఇవ్వాలంటే భయపడతారు అని అంచనా వేసుకున్నాడు. దాదాపు 50 మంది అమ్మాయిలను మోసం చేశాడు. అతడి పేరు దిల్షాద్ ఖాన్. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఉంటాడు. భోపాల్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. దిల్షాద్ ఖాన్ కు తోడుగా భోపాల్ కు చెందిన అలోక్ కుమార్ ఉన్నాడు. ఇద్దరూ కలిసి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసేవారు. ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. దాంతో గుట్టు రట్టయింది. తనకు ఐదుగురు భార్యలు ఉన్నారని వారి ఖర్చులు భరించలేకే తాను ఈ మార్గం ఎంచుకున్నానన దిల్షాద్ ఖాన్ చెబుతున్నాడు.  ఖాన్ ఐదుగురిలో ఒక భార్య జబల్ పూర్ లో క్లినిక్ నిర్వహిస్తుంటుంది. అలోక్ కుమార్ భార్య ప్రభుత్వ బాలికల హాస్టల్ లో సూపరింటెండెంట్ గా పని చేస్తుంటుంది. వీరికి ఈ కేసుతో సంబంధం లేదు కానీ పోలీసులు అనుమానం నివృత్తి చేసుకోవడానికి వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులు అయితే మాత్రం పోలీసు కష్టడీలో ఊచలు లెక్కపెడుతున్నారు.

Related posts

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

Satyam NEWS

పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్భంధిస్తాం: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!