అదృష్టం అంటే ఇలా ఉండాలి అనుకుంటారు అందరూ. గ్యారెంటీగా. ప్రజలకు సేవ చేయడం వల్లే మాకు ఈ అదృష్టం పట్టింది అంటున్నారు ఎడ్ల రమేష్, ఆయన భార్య సంధ్య. వీరిద్దరూ అమీన్ పూర్ (భీరంగూడ) మునిసిపాలిటీలోని 21, 22 వార్డులలో కౌన్సిలర్లుగా పోటీ చేశారు. అదీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వీరిని ఎవరూ గెలుస్తారని కూడా అనుకోలేదు. భార్యా భర్త ఇద్దరూ కూడా పక్కపక్క వార్డుల్లో పోటీ చేశారు. వీరిని అక్కడి ప్రజలు ఎంతగా అభిమానిస్తారంటే భార్య భర్త ఇద్దరిని గెలిపించారు. భార్యాభర్త ఇద్దరూ కౌన్సిలర్లే పక్క పక్క వార్డులకు.