హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో బాటు శివారు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌లో భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఎఫ్‌టీఎల్ స్థాయిని దాటింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుత హుస్సేన్‌సాగర్ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అయితే మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నందున అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
previous post