27.7 C
Hyderabad
March 29, 2024 05: 08 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో నేరాలు తగ్గాయట మీకు తెలుసా?

Anjaneekumar

హైదరాబాద్‌లో నేరాలు గత సంవత్సరంతో పోలిస్తే తొమ్మిది శాతం తగ్గాయని సిపి అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సిపి అంజనీకుమార్ వెల్లడించారు. కోఠి ఉమెన్స్ కాలేజీకి చాలా చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. మహిళ భద్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని అందుకే ఇక్కడి ప్రెస్ మీట్ పెట్టామని సిపి తెలిపారు. 

2019వ సంవత్సరంలో 874 మంది చిన్నారులను కాపాడామన్నారు. నివాసయోగ్య నగరాల్లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్‌వన్ స్థానంలో ఉందని తెలియజేశారు. భిన్న సంస్కృతుల నగరం హైదరాబాద్ అని, 2019లో వివిధ మతాల ఉత్సవాలు, కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నేరాల శాతం తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్ పోలీసులకు ప్రభుత్వం, డిజిపి నుంచి ప్రసంశలు అందాయని పేర్కొన్నారు.

చైన్ స్నాచింగ్ నేరాలు 30 శాతం తగ్గుముఖం పట్టాయని వివరించారు.  ఆటో మొబైల్ కేసులు 17 శాతం పెరిగాయని, వరకట్న కేసులు పెరిగాయన్నారు. కానీ హైదరాబాద్ పరిధిలో అత్యాచారం కేసులు తగ్గాయని, 2018లో 178 కేసులుంటే… 2019లో 150 కేసులు నమోదయ్యాయని వివరించారు.

2019లో 17 కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు పడిందన్నారు. 2019లో 27, 737 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, డ్రంకెన్ డ్రైవ్‌లో కోర్టు ద్వారా రూ.8 కోట్ల 32 లక్షల వసూళ్లు చేశామని వివరించారు. సిటీ రోడ్డు ప్రమాద కేసులు 2377 కేసులు నమోదు కాగా 261 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. హైదరాబాద్‌లో 122 పెట్రోలింగ్ కార్లు మూడు లక్షల 40 వేల సిసి టివి కెమెరాలు ఉన్నాయని సిపి వెల్లడించారు.

Related posts

‘ప్రతిభా మారుతం’ గొల్లపూడికి నమస్సుమాంజలి

Satyam NEWS

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS

వచ్చే ఏడాది నాటికి కరీంనగర్ లో తీగల వంతెన

Satyam NEWS

Leave a Comment