39.2 C
Hyderabad
March 28, 2024 14: 15 PM
Slider తెలంగాణ

గ‌ణేష్ నిమజ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు

bonthu rammohan

గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు జరిగే గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగరంలోని 32 ప్రధాన ప్రాంతాల్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి దాదాపు 20 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి ఈ క్రింది చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

గ‌ణేష్ నిమజ్జ‌న శోభ‌యాత్ర జ‌రిగే 391 కిలోమీట‌ర్ల మార్గంలో ప్ర‌తి మూడు కిలోమీట‌ర్ల‌కు ఒక గ‌ణేష్ యాక్ష‌న్ టీమ్‌ల ఏర్పాటు.

ఒక్కో టీమ్‌లో ఒక శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ లేదా శానిట‌రీ జ‌వాన్‌, ముగ్గురు ఎస్‌.ఎఫ్‌.ఏలు, 21మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా ప‌నిచేస్తారు.

నిమ‌జ్జ‌న ప్రాంతాల్లో 27 ప్ర‌త్యేక వైద్య శిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

మొత్తం 194 గ‌ణేష్ యాక్ష‌న్‌ టీమ్‌ల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌కు 481మంది సూప‌ర్‌వైజ‌ర్లు, 719 ఎస్‌.ఎఫ్‌.ఏలు, 9,849 పారిశుధ్య కార్మికుల‌ను నియ‌మించారు.

నిమ‌జ్జ‌నం సాఫీగా జ‌ర‌గ‌డానికి 32 ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్‌ల‌ను, 134 మొబైల్ క్రేన్‌ల ఏర్పాటు. క్రేన్లు ఏర్పాటు నీటి పారుదల శాఖ ద్వారా కాకుండా ఈసారి జిహెచ్ఎంసి ద్వారా ఏర్పాటు చేస్తున్నాం.

ఇప్పటికే జిహెచ్ఎంసి ద్వారా నిర్మించిన 23 గణేష్ నిమజ్జన  కొలనులలో శుభ్రమైన నీటిని నింపి నిమ‌జ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.

గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారులలో రోడ్ల  రీ-కార్పెటింగ్‌, మరమ్మత్తులు, పూడ్చివేత తదితర పనులకు రూ. 9.29 కోట్లతో 176 పనులు మంజూరు చేయడం జరిగింది.ఎస్ ఆర్ డి పి జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాం.

నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమించడం జరుగుతుంది.

జిహెచ్ఎంసి విద్యుత్ విభాగం ద్వారా 36,674 తాత్కాలిక లైట్లు రూ. 99.41 లక్షల  వ్యయంతో ఏర్పాటు చేస్తున్నాం.

నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్  చల్లడం జరుగుతుంది. 

నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం జరుగుతుంది. హెచ్ఎండిఏ  ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చెరువు నుండి నిమజ్జనం  ద్వారా  వచ్చే  వ్యర్ధాలను తొలగించడానికి వెయ్యి మందిని ప్రత్యేకంగా  నియ‌మాకం.

స‌రూర్‌న‌గ‌ర్‌, కాప్రా, ప్రగతి నగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3  బోట్లను ఏర్పాటు చేస్తున్నాం. ట్యాంక్ బండ్, స‌రూర్‌న‌గ‌ర్‌ వద్ద కేంద్ర విపత్తు  నివారణ దళాలను ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్ చెరువులో7 బోట్లను  ఏర్పాటు చేస్తున్నాం. మరో 4 స్పీడ్ బోర్డ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో  పదిమంది గజ ఈత గాళ్ల‌ను ఏర్పాటు.

విద్యుత్ శాఖ ద్వారా హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ల‌ ఏర్పాటు. స‌రూర్‌న‌గ‌ర్ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ల‌ ఏర్పాటు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాకు మొత్తం 101 అద‌న‌పు ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ల‌ను ఏర్పాటు. నిమ‌జ్జ‌న మార్గాల్లో 37,674 అద‌న‌పు లైట్ల ఏర్పాటు.

Related posts

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత

Satyam NEWS

వలస కూలీల ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ఆందోళన అవసరం లేదు

Bhavani

Leave a Comment