హైదరాబాద్ మెట్రోలో ప్రకటనల ద్వారా 300 కోట్ల రూపాయల బెట్టింగ్ స్కాం డబ్బులు కొట్టేశారు అంటూ వీడియో చేసిన యూట్యూబర్ “నా అన్వేషణ” అన్వేష్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు. సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేశారు. యూట్యూబర్ అన్వేష్ హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రకటనల మీద వరుస వీడియోలు చేశాడు. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్‌ల మీద అన్వేష్ వీడియో చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రకటనలతో రూ.300 కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేశాడని కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో అన్వేష్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు.
previous post