40.2 C
Hyderabad
April 24, 2024 17: 42 PM
Slider జాతీయం

హైదరాబాద్‌ పోలీసులపై ప్రశంసల వెల్లువ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల చావుతో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సోషల్‌ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌ పోలీసులను ప్రముఖులు అభినందిస్తున్నారు. సత్వర న్యాయం చేసినందుకు వారు పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. హైదరాబాద్ పోలీసులు సహజ న్యాయం చేశారని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసులు న్యాయం చేశారని బాబా రాందేవ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు చేతులెత్తి మొక్కుతున్నాను మీరు నిజమైన హీరోలు మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ ట్విట్టర్ లో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు.

సీఎం మౌనం గా ఉన్నారంటే ఉగ్ర రూపం చూప బోతున్నారని అర్ధం అని మంత్రి తలసాని అన్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా సిఎం గట్టి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతిచేకూరినట్లైంది. పోలీసులకు అభినందనలు. నిందితులకు ఉరిశిక్ష పడాలన్నది అందరి డిమాండ్. ఎన్ కౌంటర్ తో ఆ శిక్ష పడినట్లైంది. మహిళలపై ఆఘాయిత్యాలకు ఆలోచన చేసే వారికి ఇది గుణపాఠం కావాలి అని మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అన్నారు.

మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ మాట్లాడుతూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమాజానికి ఓ మంచి ఉదాహరణ. ఇక నుంచి రేపిస్టులు నేరం చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోతామేమోనన్న భయం ఉంటుందని అన్నారు. బిజెపి సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఇదే అతి పెద్ద సంఘటన. మహిళల భద్రతకు ఇది గ్యారెంటీ లాంటిది.

కన్నకూతుర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధను తీర్చలేం. కానీ, ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల్లో భయం కాస్త తగ్గింది. జై తెలంగాణ పోలీస్‌. క్రిమినల్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకుంటారని నమ్ముతున్నా అన్నారు.

Related posts

జూలై 4 నుంచి ఈఏపి సెట్

Sub Editor 2

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎస్

Satyam NEWS

తిరుపతి ఎన్టీసీ కాటన్ మిల్లు పునరుద్ధరణకు నిధులివ్వండి

Bhavani

Leave a Comment