28.2 C
Hyderabad
April 20, 2024 11: 44 AM
Slider ముఖ్యంశాలు

సైబర్ సెక్యూరిటీపై నేడు సాయంత్రం 4గంటలకు లైవ్

#HyderabadPolice

కరోనా లాక్ డౌన్ తదితర కారణాలతో ప్రస్తుతం ఆన్ లైన్ లోనే దాదాపుగా అందరూ తమ కార్యకలాపాలను చేసుకుంటున్నారు. ఇంటర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా లో చురుకుగా పాల్గొనడం బాగా ఎక్కువ అయింది.

ఈ పరిస్థితుల్లో మన డేటా లేదా మన వివరాలు కూడా చాలా ప్లాట్ ఫారాలలో బహిర్గతం అయిపోతున్నాయి. డేటా ప్రయివసీ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో మనం మరింతగా సైబర్ దాడులకు గురి అయ్యే ప్రమాదం కూడా ఏర్పడుతున్నది.

ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్ తో సంయుక్తంగా నేడు లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నేటి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ సాగే ఈ లైవ్ కార్యక్రమంలో ‘‘ఆన్ లైన్ లో మీ ప్రయివసీ అంశాలు’’ అనే సబ్జెట్ పై నిపుణులు మీ అనుమానాలను నివృత్తి చేస్తారు.

మహిళలు, పిల్లలకు సైబర్ భద్రత కల్పించడంలో భాగంగా ప్రారంభించిన ఆన్ లైన్ CybHER క్యాంపెయిన్ లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ లైవ్ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు జాయింట్ కమిషనర్  వినాష్ మొహంతి, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రవీణ్ దుగ్గల్, డేటా ప్రయివసీ నిపుణుడు రోహిత్ వాత్సవ పాల్గొంటారు.

మీరు కూడా నేటి సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అయ్యే ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొనండి.

(తెలంగాణ మహిళా పోలీసు భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ కు ప్రత్యేకం)  

Related posts

అతి శీతల ప్రదేశంలో హృదయవిదారక మరణం

Satyam NEWS

కూరగాయలు పంచిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్

Satyam NEWS

టెన్నిస్ కోర్ట్ పనులన్నీ పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment