27.7 C
Hyderabad
April 25, 2024 07: 32 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏలూరు ఘ‌ట‌న‌పై హైప‌వ‌ర్ క‌మిటీ ఏర్పాటు

Eluru

ఏలూరులో జ‌రిగిన వింత వ్యాధిపై కార‌ణాల‌ను తెలుసుకునేందుకు హైపవర్ కమిటీని రాష్ర్ట ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో 21 మంది సభ్యుల ఉన్నారు. కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీని నియ‌మించింది. కన్వీనర్ గా ఆరోగ్య శాఖ ప్రినిపల్స్ సెక్రెటరీ నివారణ చర్యలు కూడా సూచించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ వ్యాధి నీటి ద్వారా సోకింద‌ని ప‌లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Related posts

గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి

Satyam NEWS

కేంద్ర సొమ్ము దోచుకుతింటున్న వైకాపా నేతలు

Satyam NEWS

ట్రేస్ డ్: బుద్ధి లేకుండా ప్రవర్తించిన ఐఏఎస్ అధికారి

Satyam NEWS

Leave a Comment