20.7 C
Hyderabad
February 5, 2023 03: 03 AM
Slider కృష్ణ

నేను బీసీ ల ఇంటి కోడల్ని

#Minister Roja

తన భర్త సెల్వమణి బీసీ సామాజికవర్గానికి చెందినవారని… తాను కూడా బీసీ ఇంటి కోడలినేనని ఏపీ మంత్రి రోజా అన్నారు. విజయవాడలో వైసీపీ నిర్వహించనున్న బీసీ మహాసభకు సంబంధించిన పోస్టర్ ను నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె విమర్శించారు.

బీసీలను వెనుకబడినవారిగా కాకుండా… రాష్ట్రానికే వెన్నెముకగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్ దని అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు.

విజయవాడలో నిర్వహించే బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. బీసీలను ఓటు బ్యాంకుగా భావించే చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.

Related posts

షరతులు లేని చర్చలకు రైతులను ఆహ్వానించాలి

Satyam NEWS

గుడ్ ప్లాన్: కరోనా సమయంలోనూ రైతు సంక్షేమం

Satyam NEWS

బహుభాషా కోవిదుడు… గొప్ప రాజనీతిజ్ఞుడు పివి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!